లాస్ట్ ఛాన్స్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్ ఎటాక్ మొదలైంది.. ఇప్పటికే అసలు ఇంకా ఎక్కడి లాస్ట్ చాన్స్ అప్పుడే అయిపోయిందికదా.. ఇక, ఆయన జీవితంలో మళ్లీ సీఎం కాలేడంటూ కామెంట్లు చేస్తున్నారు ఏపీ మంత్రులు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి గుడివాడ అమర్నాథ్… చంద్రబాబు నాయుడుకి 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు.. ఇప్పుడు ప్రత్యేకంగా చివరి ఎన్నికలు ఏంటి? అని ప్రశ్నించారు.. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎవరికి నష్టం..? అని ఎద్దేవా చేసిన ఆయన.. చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి ఇవే ఆఖరి ఎన్నికలు అని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. రాయలసీమ ప్రజలు ప్రశ్నిస్తే… కొట్టమని చెప్తారా.. ? అని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఆయన పార్ట్నర్ ల గురించి జనానికి బాగా తెలుసన్నారు. మరోవైపు.. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తానని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకి ఉందా? అని సవాల్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్..
Read Also: Gautam Adani New Plans: విదేశాల్లో కొత్త బిజినెస్.. క్లారిటీ ఇచ్చిన గౌతమ్ అదానీ..