CM Chandrababu: అమరావతిలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 5 అంటే ప్రతి ఒక్కరికీ టీచర్స్ డే గుర్తుకొస్తుందని అన్నారు. నేను సీఎం అయినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవుతున్నాను.. భారతదేశ చరిత్రలో తల్లిదండ్రుల తర్వాత గౌరవించేది ఉపాధ్యాయులనే.. జీవితంలో ఎవర్ని మర్చిపోయినా, చదువు చెప్పిన ఉపాధ్యాయులను మాత్రం మర్చిపోలేం.. పిల్లలకు విద్యను అందించడమే కాకుండా, వారిలో స్ఫూర్తిని నింపేది టీచర్లేనని గుర్తు చేశారు. చిన్నతనంలో తనకు బోధించిన ఉపాధ్యాయుడు భక్తవత్సలం గారు ఇప్పటికీ గుర్తుంటారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Ajinkya Rahane: టీమిండియాకు అతడు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారతాడు.. ఆసియా కప్ మనదే!
అయితే, గత ఏడాది బుడమేరు వరదల కారణంగా గురుపూజోత్సవం జరుపుకోలేకపోయామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈసారి 175 మంది ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలు, సలహాలతో వారి ఫోటోలతో కూడిన పుస్తకాన్ని ముద్రిస్తామని తెలిపారు. ఇక, చిత్తూరు రేణిగుంట పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేసి.. భారత రాష్ట్రపతిగా ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం.. విద్య యొక్క లక్ష్యం సంపాదనే కాదు.. వివేకాన్ని, విమర్శన శక్తిని పెంపొందించాలని వెల్లడించారు. అక్షరజ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని డాక్టర్ రాధాకృష్ణన్ చెప్పిన మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు.
Read Also: CM Revanth Reddy: గత పాలనలో రెవెన్యూ ఉద్యోగులపై దోపిడీదారులనే ముద్ర వేశారు: సీఎం రేవంత్ రెడ్డి
ఇక, రాజకీయ నాయకుల పిల్లలు సాధారణంగా చదువుకోరు.. గారాబంతో పిచ్చి అలవాట్లకు గురౌతారని సీఎ చంద్రబాబు అన్నారు. కానీ నారా లోకేష్ ఈ స్థితికి రావడంలో ఆయన తల్లి కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. చుక్కా రామయ్య లాంటి వారు విద్య కోసం ఎన్నో ఒత్తిడులను తట్టుకుని నిలబడ్డారు.. బిట్స్ పిలాని వంటి ప్రఖ్యాత సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ఎక్కువగా ఎంపికవుతున్నారని చెప్పుకొచ్చారు. 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఐటీని బలంగా ప్రమోట్ చేశాను.. పిల్లలకు ఇచ్చే ఆస్తుల కంటే చదువు అందిస్తే ఊహించని స్థాయికి ఎదుగుతారు. ప్రపంచవ్యాప్తంగా ఆదాయం సంపాదిస్తున్న వారిలో భారతీయులు ఎక్కువ. అందులో 33 శాతం తెలుగువారే ఉన్నారని చంద్రబాబు తెలిపారు.
