Site icon NTV Telugu

High Court: బిగ్‌ బ్రేకింగ్‌.. జీవో నంబర్‌1ని సస్పెండ్‌ చేసిన హైకోర్టు..

High Court

High Court

High Court: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1 రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.. బ్రిటీష్‌ కాలం నాటి చట్టాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందంటూ ప్రతిక్షాలు మండిపడుతున్నాయి.. అయితే, జీవో నంబర్‌ 1ని సస్పెండ్‌ చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. ఈ నెల 23వ తేదీ వరకు జీవో నంబర్‌ 1ని సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. జీవో నంబర్‌ 1ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, జీవో నంబర్‌ 1 నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడిన హైకోర్టు.. దీనిపై ఈ నెల 20వ తేదీలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది..

Read Also: G20 Preparatory Conference in Vizag: విశాఖను అందంగా తీర్చిదిద్దాలి.. సీఎం జగన్‌ ఆదేశాలు

కాగా, రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలు, సభలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ వన్ పై దుమారం కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు ఫైర్‌ అవుతున్నాయి.. ప్రతిపక్షాలను ప్రజల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే ఈ జీవో తెచ్చారని ఆరోపిస్తున్నారు.. బ్రిటీష్ కాలం నాటి జీవోలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు.. తమ సభలకు వస్తోన్న జనం, ప్రజల నుంచి వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేకే సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్బంధాలకు తెరతీశారని ఆరోపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో హైకోర్టులో చోటు చేసుకున్న పరిణామం ఆసక్తికరంగా మారింది.. మరి ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసే కౌంటర్‌లో ఎలాంటి విషయాలను వివరిస్తుంది.. హైకోర్టు ఎలా స్పందిస్తింది.. ఇంతకి జీవో నంబర్‌ వన్‌ కొనసాగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version