Site icon NTV Telugu

Amaravati Farmers Padayatra: అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌.. షరతులు వర్తిస్తాయి..

Amaravati Farmers Padayatra

Amaravati Farmers Padayatra

అమరావతి రైతుల మహా పాదయాత్రకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రేదశ్‌ హైకోర్టు.. అయితే, కొన్ని పరిమిత ఆంక్షలతో మహా పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… పాదయాత్రకు అనుమతి కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి.. హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేసింది.. 600 మంది పాదయాత్రలో పాల్గొనేలా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది… వాదనలు విన్న హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇవ్వడగా.. పాదయాత్రలో పాల్గొనే వారికి ఐడీ కార్డులివ్వాలని సూచించింది.. ఇక, పాదయాత్ర ముగింపు రోజు మహాసభకు ముందుగానే అనుమతి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. కాగా, ఈనెల 12వ తేదీ నుండి నవంబర్ 11వ వరకు అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగనుంది.

Read Also: BJP Floor Leader: లాస్ట్‌ ‘ఆర్‌’ కే ఆ ఛాన్స్‌..! ఫ్లోర్‌ లీడర్‌ రేసులో ఈటల..!

మరోవైపు.. హైకోర్టు ఆదేశాలకు ముందు.. రాజధాని రైతుల రెండో విడత పాదయాత్రకు అనుమతి నిరాకరించారు పోలీసులు.. ఈ నెల 12 నుంచి నవంబర్ 11వ తేదీ వరకు అమరావతి-అరసవల్లి యాత్రకు డీజీపీని అనుమతి కోరారు రాజధాని రైతులు.. కానీ, అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేశారు డీజీపీ. తొలి విడత పాదయాత్రలో నిబంధనలు ఉల్లంఘించారని.. 70 క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్న డీజీపీ. కోనసీమ, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రత్యేక పరిస్థితులున్నాయని.. ర్యాలీలకు అనుమతివ్వలేమన్నారు.. పాదయాత్రలో పాల్గొనే మహిళలకు.. వాహనాలకు భద్రత కల్పించడం కష్ట సాధ్యమని స్పష్టం చేశారు.. ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపారు పోలీసులు.. అయితే, అమరావతి నుంచి అరసవల్లికి పాదయాత్ర చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదని కోర్టును ఆశ్రయించారు అమరావతి రైతులు.. దీంతో, హైకోర్టు రైతుల పాదయాత్రకు పరిమిత ఆంక్షలతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Exit mobile version