Site icon NTV Telugu

High Court Fine: ఇప్పటం గ్రామస్తులపై హైకోర్టు సీరియస్‌.. భారీగా జరిమానా విధింపు

High Court

High Court

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామస్తులపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇప్పటంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై కోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధించింది.. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 14 మందికి మొత్తంగా 14 లక్షల రూపాయాలు జరిమానా విధించింది హైకోర్టు. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయించినందుకు జరిమానా విధించింది న్యాయస్థానం.. అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అధికారులు నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదని కోర్టుకు అబద్ధం చెప్పి.. స్టే తెచ్చుకున్నారు. ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.

Read Also: Burj Binghatti: UAE మరో గిన్నిస్ రికార్డ్.. ప్రపంచంలోనే ఎత్తైన భవనం

అయితే, గతంలో విచారణ సందర్భంగా తమకు నోటీసులు ఇవ్వలేదని రైతుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.. కానీ, తాము నోటీసులు ఇచ్చిన తర్వాతే కూల్చేశామని ఆ విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించారు.. దీంతో, కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 14 మంది రైతులను హైకోర్టుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.. దీంతో, ఇవాళ ఆ గ్రామస్తులు కోర్టుకు హాజరయ్యారు.. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది.

Exit mobile version