Burj Binghatti: UAE మరో గిన్నిస్ రికార్డ్.. ప్రపంచంలోనే ఎత్తైన భవనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dubai Hypertower To Take Crown As World Tallest Residential Address: ఆకాశమే హద్దుగా ఎత్తైన భవనాలను నిర్మించడంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కేరాఫ్ అడ్రస్. ఎవ్వరికీ సాధ్యం కాని సరికొత్త ఇంజినీరింగ్ ఆవిష్కరణలు, భవంతులతో.. యూఏఈ ఇప్పటివరకూ ఎన్నో ఘనతల్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక బుర్జ్ ఖలీపా గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతానికి ప్రపంచంలో అదే అత్యంత ఎత్తైన భవనం. ఇప్పుడు యూఏఈ మరో సంచలనానికి తెరలేపేందుకు సిద్ధమవుతోంది. దుబాయ్‌లో అత్యంత ఎత్తైన నివాస భవనాన్ని నిర్మిస్తోంది. దుబాయ్ పరిధిలో ఆర్థిక ప్రాంతంగా పేరున్న ‘బిజినెజ్ బే’లో.. వంద ఫ్లోర్లతో ఒక హైపర్టవర్ని ఆవిష్కరించబోతోంది. దీంతో.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హైపర్టవర్గా ఇది గిన్నిస్ రికార్డ్ ఘనతని సొంతం చేసుకోబోతోంది.
అంతకుముందు ఈ రికార్డ్.. న్యూయార్క్ నగరంలోని మాన్‌హట్టన్ 57వ స్ట్రీట్‌లో సెంట్రల్ పార్క్ టవర్ పేరు మీద ఉండేది. ఆ భవనంలో 98 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇప్పుడు దుబాయ్ హైపర్‌టవర్ అంతకంటే రెండు ఎక్కువ ఫోర్లతో కలిపి మొత్తం 472 మీటర్లతో ఎత్తుతో, దాని రికార్డ్‌ని బద్దలుకొట్టబోతోంది. కేవలం ఎత్తులోనే కాదు.. అత్యంత విలాసవంతమైన నివాస భవనంగానూ ఇది చరిత్రపుటలకెక్కబోతోంది. ఈ భవనాన్ని ఎమిరేటి ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ ‘బింఘట్టి’, ప్రముఖ వాచ్‌మేకర్ కంపెనీ ‘జాకోబ్ అండ్ కో’ సంయుక్తంగా నిర్మించాయి. ప్రపంచ రికార్డు నెలకొల్పే ఉద్దేశంతోనే తాము ఈ హైపర్‌టవర్‌ను నిర్మిస్తున్నట్లు ఆ కంపెనీలు ప్రకటించాయి. ఆ రెండు సంస్థలు కలిసి ఈ నిర్మాణాన్ని చేపట్టాయి కాబట్టి.. తమ పేర్లతోనే ‘బుర్జ్ బింఘట్టి జాకోబ్ అండ్ కో రెసిడెన్సీ’గా దీనికి నామకరణం చేశారు.
Also Read
- Donald Trump: "భారత్‌ను చూసి నేర్చుకోండి".. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నా 7 శాతం వృద్ధి రేటుపై ట్రంప్ ప్రశంసలు..
- Earthquake in Peru: పెరూలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు..!
- Indus Waters Treaty: ఢిల్లీలో పాక్ మంత్రి మాలిక్.. సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక ప్రకటన..
- Trump Praises India's GDP Growth: భారత్‌ను చూసి నేర్చుకోవాలి.. దేశ ఆర్థిక వృద్ధిపై ట్రంప్ ప్రశంసలు
ఈ భవనానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. దీని అగ్రభాగం డైమండ్ ఆకారంలో ఉంటుంది. అంతేకాదండోయ్.. రాత్రిపూట మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుతురులో ఇది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్‌లతో పాటు.. మరెన్నో ప్రత్యేకమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. చివరి ఐదు ఫ్లోర్లలో అత్యంత విలాసవంతమైన పెంట్‌హౌజ్‌లను సిద్ధం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. భూతల స్వర్గాన్ని తలపించేలా ఈ భవనం ఉండబోతోంది. అయితే.. ఈ భవనాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.
తాజావార్తలు
-
Rashmika: ‘ఒసేయ్ రాములమ్మ’ అనగానే భయమేసింది.. మ్యాచ్ చేయలేం కానీ..!
-
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) అవార్డ్స్ 2026 ప్రకటన.. విజేతలు వీరే..!
-
Supreme Court on Cousin Marriages: దగ్గరి బంధువుల మధ్య వివాహాలపై కొత్త చట్టం?.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన
-
Koti Deepotsavam 2026: కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. నేడు ఎనిమిదో రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఇవే!
-
Neena Gupta: 70 ఏళ్లుగా పరిష్కారం కాని గణిత సమస్యకు సమాధానం కనుగొన్న భారతీయ మహిళ.. నీనా గుప్తా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!