NTV Telugu Site icon

CCTV Cameras: పొరుగు రాష్ట్రాల కంటే వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్

Cctv Cameras

Cctv Cameras

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భద్రతా చర్యలపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమీక్షించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలలో వాడుతున్న సీసీ కెమెరాల సంఖ్యను కేంద్ర హోంశాఖ పరిధిలోని పోలీస్ పరిశోధన అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌డీ) వెల్లడించింది. 2021, జనవరి 1వ తేదీ నాటికి దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 2,82,558 సీసీ కెమెరాలు ఉన్నట్లు తెలిపింది. అయితే పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో సీసీ కెమెరాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు బీపీఆర్‌డీ పేర్కొంది. ఏపీలో కేవలం 20,968 సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయని వివరించింది.

అటు ఏపీకి పొరుగున ఉండే తమిళనాడులోనూ 1,50,254 సీసీ కెమెరాలు ఉన్నట్లు పోలీస్ పరిశోధన అభివృద్ధి సంస్థ తెలిపింది. ఏపీలో మొత్తం 1,021 పోలీస్ స్టేషన్‌లు ఉండగా కేవలం 600 పోలీస్ స్టేషన్‌ల పరిధిలోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 421 పోలీస్ స్టేషన్‌లలో అసలు సీసీ కెమెరాలే లేకపోవడం గమనార్హం. అటు ఏపీలోని 65 పోలీస్ స్టేషన్‌లకు వాహనాలు కూడా లేవు. 34 పోలీస్ స్టేషన్‌లలో టెలీఫోన్ సౌకర్యం లేదని బీపీఆర్‌డీ వెల్లడించింది. కాగా నేర నియంత్రణలో సీసీ కెమెరాల ఏర్పాటు పోలీసులకు ఎంతో సహకరిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.

Tirumala: తిరుమలలో కలకలం.. ఐదేళ్ల బాలుడి కిడ్నాప్

Show comments