NTV Telugu Site icon

బ్రేకింగ్‌: క‌రోనాతో చ‌నిపోయిన‌వారికి ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన ఏపీ స‌ర్కార్..

ex gratia

క‌రోనా మ‌హ‌మ్మారి వేలాది మంది ప్రాణాల‌ను తీసింది.. సామాన్యుల‌తో పాటు.. వైద్యులు, వైద్య సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు.. దీంతో.. వంద‌లాది కుటుంబాలు భారీగా న‌ష్ట‌పోయిన ప‌రిస్థితి.. దీంతో.. వారి కుటుంబాల‌కు మేం ఉన్నామంటూ భ‌రోసా ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. కరోనాతో చనిపోయిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.. కరోనా బారిన‌ప‌డి చనిపోయిన ప్రభుత్వ వైద్య సిబ్బంది కుటుంబాలకు ఈ ప‌రిహారాన్ని అందించ‌నున్నారు.. కోవిడ్‌తో డాక్ట‌ర్ చ‌నిపోతే వారి కుటుంబానికి రూ.25 ల‌క్ష‌లు, స్టాఫ్ న‌ర్స్‌ల కుటుంబాల‌కు రూ.20 ల‌క్ష‌ల చొప్పున‌, ఎంఎన్‌వో, ఎఫ్ఎన్‌వో చనిపోతే రూ.15 లక్షలు, ఇతర వైద్య సిబ్బంది చనిపోతే రూ.10 లక్షల మేర ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం.. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని స‌ర్కార్ ఆదేశించింది.. కోవిడ్ విధులకు సంబంధించి డ్యూటీల్లో ఉంటూ కరోనా సోకి చనిపోయిన వైద్య సిబ్బంది కుటుంబాలకు ఈ ప‌రిహారం వ‌ర్తింప‌జేయ‌నున్నారు.