Site icon NTV Telugu

AP Government: మార్చి, ఏప్రిల్‌లో ప్రభుత్వ పథకాల తేదీలు ఖరారు.. కోడ్‌ ముగియగానే వరుసగా కార్యక్రమాలు

Ys Jagan

Ys Jagan

AP Government: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం.. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, పథకాల అమలుకు బ్రేక్‌ పడింది.. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే వరుసగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలు ఖరారు చేశారు.. సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు.. అసెంబ్లీ సమావేశాలు, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలు చేయాల్సిన పథకాల తేదీలను ఫైనల్‌ చేశారు..

Read Also: Microsoft: మైక్రోసాఫ్ట్‌ సంచలన నిర్ణయం.. కోడింగ్‌తో పనిలేదు..!

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా పలు కార్యక్రమాలు నిలిచిపోయాయి.. ఎన్నికల కోడ్‌ ముగియనుండడంతో ఈ కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.. అయితే, ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10వ తేదీ నుంచి మధ్యాహ్న భోజనంతో పాటు రాగిజావ అమలు ప్రారంభించబోతున్నారు.. ఇక, మార్చి 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు.. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూలు.. ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే విషయాన్ని ఖరారు చేయనున్నారు..

Read Also: Kerala Chief Minister: మనీష్ సిసోడియా అరెస్ట్‌పై ప్రధానికి కేరళ సీఎం లేఖ

ఇక, మార్చి 18వ తేదీన సంపూర్ణ ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం.. జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో నగదు జమ చేయనున్నారు. మార్చి 22న ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్లు ప్రకటించనున్నారు.. వీరికి ఏప్రిల్‌ 10న అవార్డులు, రివార్డులు అందజేయనున్నారు. మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభించనున్నారు. మార్చి 25వ తేదీ నుంచి వైయస్సార్‌ ఆసరా.. ఏప్రిల్‌ 5వ తేదీ వరకు కొనసాగనుంది. మార్చి 31న జగనన్న వసతి దీవెన.. ఏప్రిల్‌ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలు.. ఏప్రిల్‌ 10న వాలంటీర్లకు సన్మానం.. ఏప్రిల్‌ 18న ఈబీసీ నేస్తం.. ఇలా వరుస కార్యక్రమాలు, పథకాల అమలు చేయనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

Exit mobile version