NTV Telugu Site icon

Andhra Pradesh: సెలవుల క్యాలెండర్ విడుదల.. ఉగాది, వినాయకచవితికి వాళ్లకు నో హాలీడే

Holidays

Holidays

Andhra Pradesh: 2023 ఏడాదికి గానూ సెలవుల క్యాలెండర్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రభుత్వ కార్యాలయాలకు 23 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. సాధారణ సెలవుల్లో మూడు ఆదివారాలు, ఒకటి రెండో శనివారం.. ఐచ్ఛిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. మకర సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారాల్లో.. సాధారణ సెలవుల్లో వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారుల అనుమతితో ఐదు ఐచ్ఛిక సెలవులను పొందేందుకు వీలు కల్పించింది. రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ వంటి పండుగలతోపాటు తిథులను బట్టి వచ్చే హిందూ పండుగల్లో మార్పులు ఉంటాయని, వాటిని ముందుగానే పత్రికా ప్రకటన, మీడియా ద్వారా తెలియజేస్తామని ప్రభుత్వం తెలిపింది.

Read Also: Puri Jagannadh : ఆ ఆలయంలో సెల్ ఫోన్లు నిషేదం.. జనవరి నుంచే అమలు

అయితే ఉగాది, శ్రీరామ నవమి, వినాయక చవితి పండుగల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. దీంతో బ్యాంకర్లు షాకవుతున్నారు. ఈ అంశంపై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యమైన హిందూ పండుగలకు సెలవులు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం మూడేళ్లుగా ఇలాగే వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే ఈ మూడు పండుగలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేసింది.