ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డుదారులకు రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. బియ్యం తీసుకోవాలా, డబ్బులు తీసుకోవాలా అనేది లబ్ధిదారుల ఇష్టమని తెలిపింది.. అయితే, ఇప్పుడు నగదు బదిలీని వాయిదా వేసినట్టు తెలిపారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పౌర సరఫరాల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి.. 26 జిల్లాల జేసీలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో.. రేషన్ కార్డుదారులకు నగదు బదిలీని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు వెల్లడించారు.. యాప్‌లో సాంకేతిక లోపం వల్ల ప్రస్తుతానికి నగదు బదిలీ నిలిపివేశామని.. నగదు బదిలీపై తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకుంటే సమాచారం తెలియజేస్తామని స్పష్టం చేశారు.
Read Also: Chevireddy Bhaskar Reddy: అధ్యక్షుడిగా జగనన్న అవకాశం ఇచ్చారు.. సైనికుడిలా పనిచేస్తా..
ఇక, రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని.. జిల్లా యూనిట్టుగా తీసుకుని రైతులకు దగ్గరగా ట్రాన్స్ పోర్టు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మంత్రి కారుమూరి.. రైతులకు ఆలస్యం లేకుండా సకాలంలో డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటామని.. ప్రజలకు పోషక ఆహారం కోసం పోర్టిఫైడ్ బియ్యం ఇస్తున్నాం అన్నారు.. పోర్టిఫైడ్ రైస్ ను నీటిలో కడిగినప్పుడు తేలుతాయి.. పోర్టెడ్ బియ్యాన్ని ప్రజలు ప్లాస్టిక్ బియ్యంగా భావించవద్దన్నారు. ప్రజలకు ఇస్తోన్న బియ్యం క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీలేదన్న ఆయన.. ధాన్యం, రేషన్ విషయంలో ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.. 21 నుంచి నెల 10 రోజుల్లో ధాన్యం సొమ్ములు రైతులకు అందిస్తామని.. రైతులకు ఆధార్ తో అనుసంధానమైన అకౌంట్లలో ధాన్యం డబ్బు జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. కొందరు రైతులకు 4 బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నాయి.. వేరొక అకౌంట్స్ లో ధాన్యం డబ్బులు పడటం వల్ల రైతులు తెలుసుకోలేక పోతున్నారని తెలిపారు.. ఇప్పటి వరకు రైతులందరికీ ధాన్యానికి సంబంధించి చెల్లింపులు చేశాం.. ఎక్కడా పెండింగ్ లేదన్నారు మంత్రి కారుమూరి.
