NTV Telugu Site icon

ప్రైవేట్ ఆస్ప‌త్రి వైద్యులు, సిబ్బందికి కూడా ఆర్థిక‌సాయం..?

AP Govt

క‌రోనా రోగుల‌కు సేవ‌లు అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన ప్ర‌భుత్వ వైద్య సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.. కోవిడ్ విధులు నిర్వ‌హిస్తూ ఆ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి చ‌నిపోయిన ప్ర‌భుత్వ వైద్యుల కుటుంబాల‌కు రూ.25 ల‌క్ష‌లు, స్టాఫ్ న‌ర్స్‌ల కుటుంబాల‌కు రూ.20 ల‌క్ష‌ల చొప్పున‌, ఎంఎన్‌వో, ఎఫ్ఎన్‌వో చనిపోతే రూ.15 లక్షలు, ఇతర వైద్య సిబ్బంది చనిపోతే రూ.10 లక్షల మేర ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. అంతే కాదు.. ఇప్పుడు ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో ప‌నిచేసే వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా ఎక్స్‌గ్రేషియా అందించేలా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.. కోవిడ్ రోగులకు సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు, నర్సులు, సిబ్బందికి కూడా ఆర్ధిక సహాయం పై పరిశీలన చేయాలని అధికారుల‌ను ఆదేశించారు ఏపీ సీఎం.. మ‌రి.. వీరికి కూడా ప్ర‌భుత్వ వైద్యుల‌కు, వైద్య సిబ్బందికి త‌ర‌హాలోనే ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారా? లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది.