NTV Telugu Site icon

Andhra Pradesh: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన సర్కార్..

Ab Venkateswara Rao,

Ab Venkateswara Rao,

సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీకి రిపోర్ట్ చేయాలవి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. కాగా, గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీవీ అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై సస్పెండ్‌ చేసింది వైసీపీ ప్రభుత్వం.. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై సుదీర్ఘ పోరాటమే చేశారు ఏబీవీ.. తన సస్పెన్షన్‌పై హైకోర్టు, సుప్రీం కోర్టులను కూడా ఆశ్రయించారు.. ఈ మధ్యే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ సుప్రీం తీర్పు వెలువరించింది. వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది..

Read Also: Big Breaking: రాజీవ్‌ గాంధీ హత్య కేసు.. సుప్రీం సంచలన తీర్పు

మరోవైపు. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ గతంలోనే ఏపీ హైకోర్టు కూడా తీర్పు వెలువరించింది.. సుప్రీం కోర్టు కూడా ఆ ఆదేశాలే ఇచ్చింది.. ఫిబ్రవరి 7వ తేదీతో ఏబీ వెంకటేశ్వరరావు రెండేళ్ల సస్పెన్షన్‌ ముగిసినట్టేనని, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఆయనకు ఇవ్వాల్సిన జీతభత్యాలను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసిన కోర్టు.. వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశించింది.. ఇక, సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఈ మధ్యే రెండు మూడు సార్లు సచివాలయానికి వచ్చారు ఏబీ వెంకటేశ్వరరావు.. యూనిఫాం ధరించి మరి సచివాలయంలో అడుగుపెట్టారు. ఇప్పుడు ఏపీ సర్కార్‌ కూడా సస్పెన్షన్‌ ఎత్తివేడం.. జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించడంతో.. ఆయన సేవలను ప్రభుత్వం ఎలా ఉపయోగించుకోనుంది అనేది ఆసక్తికరంగా మారింది.