Budget 2023-24: బడ్జెట్‌లో సంక్షేమం, విద్యా, వైద్యానికి పెద్ద పీట వేసింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. మొత్తం బడ్జెట్ లో ఆర్ధిక సేవలకు వ్యయం 69, 306 కోట్లుగా ఉంది.. బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది.. 51,345 కోట్ల రూపాయలు సంక్షేమానికి కేటాయించారు.. మొత్తం కేటాయింపుల్లో ఇది 27 శాతం.. సాధారణ విద్యకు రెండో ప్రాధాన్యత కేటాయింపులు లభించాయి.. మాధ్యమిక, ఉన్నత విద్యకు 32,198 కోట్లు కేటాయించారు. మొత్తం కేటాయింపుల్లో ఇది 16 శాతంగా ఉంది.. మూడవ ప్రాధాన్యత వైద్య, ఆరోగ్య శాఖకు దక్కింది.. ఈ రంగానికి 15, 882 కోట్ల రూపాయలు కేటాయించారు.. మొత్తం కేటాయింపుల్లో వైద్యా, ఆరోగ్య శాఖ వాట 8 శాతంగా ఉంది. వార్షిక బడ్జెట్‌లో ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమానికి జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కోవిడ్ అనంతరం ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణను ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇది రాబోయే రోజులలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుంది. ఈవిషయంలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆరోగ్య సంరక్షణ సంస్థలను ప్రాథమిక స్థాయి నుంచి అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ స్థాయికి మార్చడంతో పాటు సౌకర్యాల భౌతిక స్థాయిని పెంచడం మాత్రమే కాకుండా, అవసరమైన పరికరాలు, శిక్షణ పొందిన మానవ వనరులను సమకూర్చడంలో ఎంతో ఉపయోగపడనుంది.
Read Also: Bandi Sanjay: నేరస్తుల్ని కాపాడేందుకు సిట్.. కేటీఆర్ రాజీనామా చేయాలి
ఇక, జాతీయ ఆరోగ్య మిషన్ కింద 108 సేవలు, 104 సేవలు, కుటుంబ సంక్షేమం వంటి ప్రాధాన్యతా కార్యక్రమాలను బలోపేతం చేయడంతో పాటు, ముఖ్యమైన పథకాల కింద బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది జగన్ సర్కార్.. వ్యాధులు రాకుండా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా, ఆరోగ్య సంరక్షణ సేవలను పౌరుల ఇంటి వద్దకు కుటుంబ వైద్యుల కార్యక్రమం ద్వారా తీసుకువెళ్తోంది ప్రభుత్వం. అనారోగ్య సమయాలలో రోలుగు ప్రయాణించిల్సిన అవసరం లేకుండా, తదపరి సంరక్షణపై మెరుగైన పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దాదాపు 1.41 కోట్ల కుటుంబాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. వ్యాధి గుర్తింపు, చికిత్స, నివారణ విధానాలకు 2,446 నుంచి 3,255కు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెంచింది. మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలలో కూడా 716 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందో విధంగా ఈ పథకాన్ని విస్తరించిన విషయం విదితమే.
Read Also: Virat Kohli కోహ్లీ స్పీచ్ తో ఆర్సీబీ అమ్మాయిల్లో జోష్.. సానియాపై సెటైర్లు వేస్తున్న నెటిజన్స్..
కాగా, రూ.2,79,279 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం.. రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు, మూలధన వ్యయం రూ.31,061 కోట్లు, రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు, ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు, జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం,ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతంగా ఉంది.. కేటాయింపుల విషయానికి వస్తే.. వైఎస్సార్ పెన్షన్ కానుక- రూ.21,434.72 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసా రూ.4,020 కోట్లు, జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు, జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు, వైఎస్సార్- పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తం- రూ. 550 కోట్లు, జగనన్న చేదోడు-రూ.350 కోట్లు, వైఎస్సార్ వాహనమిత్ర-రూ.275 కోట్లు, వైఎస్సార్ నేతన్న నేస్తం-రూ.200 కోట్లు, వైఎస్సార్ మత్స్యకార భరోసా-రూ.125 కోట్లు ఇలా అనేక కేటాయింపులు చేసిన విషయం తెలిసిందే.
