Site icon NTV Telugu

తెలంగాణకు సాఫ్ట్‌వేర్‌.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

Manabadi Nadu Nedu

Manabadi Nadu Nedu

‘నాడు నేడు’ సాఫ్ట్ వేర్‌ను తెలంగాణ రాష్ట్రం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్‌… మన బడి, నాడు నేడు సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణలోని పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగించేకునేందుకు అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్‌.. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు నేడు సాఫ్ట్‌వేర్‌ను వినియోగించింది ఏపీ ప్రభుత్వం.. ఇక, టీసీఎస్ రూపకల్పన చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణకు ఇచ్చేందుకు నిరభ్యంతర పత్రం జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ. ఓవైపు.. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు నడుస్తున్నా.. మరోవైపు సాఫ్ట్‌వేర్‌ షేర్‌ చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించడం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version