Site icon NTV Telugu

జూనియర్‌ కాలేజీల ఫీజులు ఖరారు చేసిన ఏపీ…

cm jagan

ఏపీలో జూనియర్‌ కాలేజీల ఫీజులు ఖరారు చేసింది ప్రభుత్వం. గ్రామ, మున్సిపాల్టీ, కార్పోరేషన్ వారీగా ఫీజులను నిర్ధారించింది ప్రభుత్వం. గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న కాలేజీలలో ఎంపీసీ, బైపీసీలకు రూ.15,000 ఇతర గ్రూపులకు రూ.12,000 గా నిర్ధారించింది. ఇక మున్సిపాలిటీల పరిధిలోని కాలేజీలలో ఎంపీసీ, బైపీసీలకు రూ.17,500 ఇతర గ్రూపులకు రూ.15,000 గా… అలాగే కార్పొరేషన్ల పరిధిలోని కాలేజీలలో ఎంపీసీ, బైపీసీలకు రూ.20,000 ఇతర గ్రూపులకు రూ.18,000 గా స్పష్టం చేసింది. అయితే కరోనా కారణంగా గత ఏడాదిన్నరగా మూసేసి ఉన్న విద్య సంస్థలు ఈ మధ్యే తెరుచుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఏపీలో కూడా ఈ నెల 16 నుండి విద్య సంస్థలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

Exit mobile version