Site icon NTV Telugu

‘చింతామణి’పై సర్కార్‌ నిషేధం..

చింతామణి నాటకంపై నిషేధం విధించింది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం… చింతామణి నాటకం ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా ఉందంటూ.. నాటక ప్రదర్శనను నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆర్యవైశ్యులు.. దీంతో.. చింతామణి నాటకంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. రాష్ట్రంలో ఎక్కడా చింతామని నాటకాన్ని నిర్వహించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.. ఇక, చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల హర్షంవ్యక్తం చేశారు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఆర్యవైశ్య సంఘాలు..

Read Also: రేపు వరంగల్‌ పర్యటనకు సీఎం కేసీఆర్

కాగా, చింతామణి నాటకం తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక నాటకం. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకం లీలాశుకచరిత్ర ఆధారంగా రచించబడినది.. 1923 నాటికే సుమారు 446 సార్లు దేశమంతా ప్రదర్శింబడిన ఈ నాటకపు ప్రాచుర్యం తెలియజేయుచుంది.. కానీ, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఈ నాటక ప్రదర్శన పూర్తిగా నిషేధించబడింది.

Exit mobile version