విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తెలంగాణలో ఇవాళ్టితో పాఠశాలలు ముగిసాయి.. రేపటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది సర్కార్.. జూన్ 13వ తేదీన తిరిగి తెరుచుకోనున్నాయి.. ఇక, ఏపీ సర్కార్ కూడా సమ్మర్ హాలిడేస్ ప్రకటించింది.. మే 6వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయంటూ ఆదేశాలు జారీ చేశారు పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్… వచ్చే నెల 4వ తేదీలోగా 1-10 తరగతుల్లో అవసరమైన పరీక్షల నిర్వహణను పూర్తి చేయాలని ఆదేశించారు.. మే 6వ తేదీ నుంచి వేసవి సెలవులు ఉండగా.. జులై 4వ తేదీ నుంచి స్కూళ్లు రీ-ఓపెన్ కానున్నాయి.. అంటే, జులై 4వ తేదీ నుంచి 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది.
Read Also: Ambati Rambabu: చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారు..