Site icon NTV Telugu

Breaking: మరోసారి ఏపీ సీఎస్ పదవీకాలం పొడిగింపు..

Cs Sameer Sharma

Cs Sameer Sharma

ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా ఉన్న సమీర్ శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే దీనిపై కేంద్రానికి విజ్ఞప్తి చేశారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీఎస్‌ సమీర్‌ శర్మ పదవీకాలాన్ని ఈ ఏడాది నవంబర్‌ 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. ఏపీ సీఎస్‌ పదవీకాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది డీవోపీటీ.

Read Also: TDP vs TDP: జేసీకి పల్లె రఘునాథరెడ్డి కౌంటర్‌.. నా పర్మిషన్‌ ఉంటేనే..!

కాగా, గత ఏడాది నవంబర్‌లోనే సీఎస్‌ సమీర్‌ శర్మ పదవీవిరమణ చేయాల్సి ఉండగా.. ఆయన పదవీకాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత సీఎస్ సమీర్‌ శర్మ పదవీకాలం పొడిగించడానికి అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం.. కేంద్రం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. సమీర్‌ శర్మ ఆ పోస్టులో 2022 మే 31వ తేదీ కొనసాగాల్సి ఉంటుంది. దాని ప్రకారం జూన్‌ 1వ తేదీ నుంచి కొత్త సీఎస్‌ పాలన రావాల్సి ఉంది.. కానీ, మరోసారి ఆయన పదవీకాలాన్ని పొడిగించింది ఏపీ సర్కార్‌.. దీనిపై ప్రధాని మోడీకి సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.. దీంతో.. మరోసారి ఆయన పదవీకాలాన్ని పొడిగించారు.. జూన్‌ 1వ తేదీ నుంచి నవంబర్‌ 30వ తేదీ వరకు ఏపీ సీఎస్‌ పదవి కాలాన్ని పొడిగించింది కేంద్రం.. ఈ ఉత్తర్వులతో ఈ ఏడాది నవంబర్‌ 30వ తేదీ వరకు ఏపీ సీఎస్‌గా కొనసాగనున్నారు సమీర్‌ శర్మ.

Exit mobile version