NTV Telugu Site icon

ఏపీలో క‌రోనా క‌ల్లోలం.. 19 వేలు దాటేసిన కొత్త కేసులు

Covid 19 ap

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. రోజుకో కొత్త రికార్డు త‌ర‌హాలో కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉండ‌గా.. సెక‌వండ్ వేవ్‌లో అత్య‌ధికంగా ఇవాళ ఏకంగా 19 వేల పైచీలుకు కేసులు న‌మోదు అయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌తో 24 గంటల్లో 19,412 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 61 మంది కోవిడ్ బారిన‌ప‌డి మృతిచెందారు.. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,21,102కు చేరుకోగా.. మృతుల సంఖ్య 8 వేలు దాటింది. ఇక‌, ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.. 17382 డోసుల రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఆస్పత్రులకు సరఫరా చేశామ‌న్నారు.. 188 ఆస్పత్రులు రెమిడెసివిర్ ఇంజెక్షన్ల కోసం ఇండెంట్ పెట్టాయ‌ని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 5371 డోసులు రెమిడెసివిర్ ఇంజెక్షన్లు వినియోగించారు. ప్రభుత్వాస్పత్రుల్లో రెమిడెసివిర్ డోసులు అందుబాటులో ఉన్నాయ‌ని.. 551 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స చేస్తున్నార‌ని.. 43491 బెడ్లు ఉన్నాయి.. 32301 బెడ్లు ఆక్యుపై అయ్యాయ‌న్నారు.