NTV Telugu Site icon

ఏపీలో త‌గ్గ‌ని కోవిడ్ జోరు.. మ‌ళ్లీ వంద దాటిన మృతులు

AP COVID 19

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా సెకండ్‌వేవ్ క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న త‌గ్గిన‌ట్టే త‌గ్గిన కొత్త కేసులు.. క్ర‌మంగా రెండు రోజుల నుంచి మ‌ళ్లీ పెరుగుతున్నాయి.. గ‌డిచిన 24 గంట‌ల్లో 23,160 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు కాగా… మ‌రోసారి వంద మార్క్‌ను క్రాస్ చేసిన మృతుల సంఖ్య‌.. 106కు పెరిగింది.. ఇదే స‌మ‌యంలో 24,819 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,98,532కి చేరుకోగా.. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,09,736గా ఉంది. కోవిడ్ బారిన‌ప‌డి మృతిచెందిన‌వారి సంఖ్య 9,686కు పెరిగింది.. ఇవాళ అత్య‌ధికంగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో 17 మంది మృతిచెంద‌గా, నెల్లూరు, విశాఖ‌ప‌ట్నంలో 11 మంది చొప్పున‌, తూర్పుగోదావ‌రి, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో 9 మంది చొప్పున‌, అనంత‌ర‌పురం, కృష్ణా, చిత్తూరు, శ్రీ‌కాకుళం జిల్లాల్లో 8 మంది చొప్పున‌, గుంటూరులో ఏడుగురు, క‌ర్నూలులో ఐదుగురు చొప్పున ప్రాణాలు వ‌దిలారు.. ఇక‌, అత్య‌ధికంగా ఇవాళ తూర్పు గోదావ‌రిలో 3,528 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. క‌రోనా క‌ట్ట‌డికి క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నా.. క్ర‌మంగా కోవిడ్ కేసులు పెరుగుతూ ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.