NTV Telugu Site icon

ఏపీ కరోనా అప్‌డేట్.. భారీగా తగ్గిన కేసులు..

COVID

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 71,758 సాంపిల్స్ పరీక్షించగా… 2,224 మందికి పాజిటివ్‌గా తేలింది.. మహమ్మారితో మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.. చిత్తూరులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పు గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున, అనంతపూర్‌, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఇక, విశాఖ, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు.. ఇదే, సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 4,714 మంది కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,82,096కు చేరుకోగా… రికవరీ కేసులు 18,27,214కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో 12,630 మంది మృతిచెందగా… ప్రస్తుతం రాష్ట్రంలో 42,252 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.