ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా కిందికి దిగివస్తోంది… రాష్ట్రంలో గత 24 గంటల్లో 93,759 సాంపిల్స్ ని పరీక్షిచంగా.. 3,464 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మరో 35 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. చిత్తూరులో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒక్క రు, కర్నూల్‌లో ఒక్కరు, పశ్చి మ గోదావరిలో ఒక్క రు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 4,284 మంది కోవిడ్ నుండి పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,96,818కి పెరగగా… రికవరీ కేసులు 18,46,716కు చేరింది.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 12,779కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 37,323గా ఉన్నాయి.
ఏపీ కరోనా అప్‌డేట్.. భారీగా తగ్గిన కేసులు..
COVID