NTV Telugu Site icon

ఏపీ కోవిడ్ అప్‌డేట్‌.. త‌గ్గిన టెస్ట్‌లు, కేసులు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌రోనా కేసుల సంఖ్య కాస్త త‌గ్గింది.. ఇదే స‌మ‌యంలో.. కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు సంఖ్య కూడా త‌గ్గిపోయింది.. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,635 శాంపిల్స్ ప‌రీక్షిచంగా.. 12,561 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. మ‌రో 10 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. విశాఖ‌లో ముగ్గురు, క‌ర్నూలు, నెల్లూరులో ఇద్ద‌రు చొప్పున‌, అనంత‌పురం, చిత్తూరు, గుంటూరు, విజ‌య‌న‌గ‌రం, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఒక్కొక్క‌రు చొప్పున క‌న్నుమూశారు.. మ‌రోవైపు ఒకే రోజు 8,742 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు..

Read Also: మూడు రాజ‌ధానుల‌పై మ‌రోసారి విచార‌ణ‌..

ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన టెస్ట్‌ల సంఖ్య 3.23.65,775కు చేర‌గా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 33,48,608కు, కోలుకున్న‌వారి సంఖ్య 21,20,717కు, మృతుల సంఖ్య 14,5914కు పెరిగింది.. ఇక‌, ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,13,300 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. అత్య‌ధికంగా క‌ర్నూలులో 1710, గుంటూరులో 1625, క‌డ‌ప‌లో 1215, విశాఖ‌ప‌ట్నంలో 1211, కృష్ణా జిల్లాలో 1056 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్ర‌భుత్వం.