NTV Telugu Site icon

ఏపీ కరోనా అప్‌డేట్‌

ఆంధ్రప్రదేశ్‌ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త కిందకు పైకి కదిలినా.. భారీ సంఖ్యలోనే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 22,882 శాంపిల్స్‌ పరీక్షంచగా.. 4,108 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది.. ఇవాళ ఎలాంటి మరణాలు సంభవించలేదు.. ఇక, ఇదే సమయంలో మరో 696 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,18,84,914 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,10,388కు చేరింది.. 20,65,696 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 30,182గా ఉన్నాయి.. ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి రాష్ట్రంలో మృతిచెందినవారి సంఖ్య 14,510కి చేరింది.. తాజా కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నంలో 1,018, చిత్తూరు జిల్లాలో 1,004, గుంటూరులో 345, కడపలో 925, తూర్పు గోదావరిలో 263గా నమోదు అయ్యాయి.
Read Also: రిపబ్లిక్‌ డే స్పెషల్‌ సేల్.. 80 శాతం వరకు డిస్కౌంట్లు..