Site icon NTV Telugu

ఏపీలో త‌గ్గిన కోవిడ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా రోజువారి కేసులు మ‌రింత త‌గ్గాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,598 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 2,690 మందికి పాజిటివ్‌గా తేలింది.. మ‌రో 9 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ప్ర‌కాశం జిల్లాలో ఇద్ద‌రు, అనంత‌పురం, చిత్తూరు, గుంటూరు, క‌ర్నూలు, నెల్లూరు, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఒక్కొక్క‌రు క‌న్నుమూశారు.. ఇక‌, ఇదే స‌మ‌యంలో 11,855 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు..

Read Also: అబద్దాలు మాట్లాడితే నాలుక కోస్తాం.. బీజేపీ నేత‌ల‌కు మంత్రి వార్నింగ్

ప్ర‌భుత్వ బులెటిన్ ప్ర‌కారం రాష్ట్రవ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య 3,26,60,687కు చేరుకోగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,03,455కి, రిక‌వ‌రీ కేసులు 22,19,219కి, మృతుల సంఖ్య 14,664కు పెరిగింది.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 69,572 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్టు ప్ర‌భుత్వం బులెటిన్‌లో పేర్కొంది.. ఇక‌, తాజా కేసుల్లో అత్య‌ధికంగా తూర్పు గోదావ‌రి జిల్లాలో 518, గుంటూరులో 354, కృష్ణా జిల్లాలో 352 కేసులు వెలుగు చేశాయి.

Exit mobile version