Site icon NTV Telugu

COVID 19 AP: 500 దిగువకు పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా కిందకు దిగివస్తోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,383 శాంపిల్స్‌ పరీక్షించగా.. 495 మందికి పాజిటివ్‌గా తేలింది.. ఇవాళ చిత్తూరు జిల్లాలో ఒక కోవిడ్‌ బాధితుడు మృతిచెందాడువ.. ఇదే సమయంలో.. 1,543 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు..

Read Also: Punjab Polls: కాంగ్రెస్‌ హామీల వర్షం.. మేం తిరిగి అధికారంలోకి వస్తే..

ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,29,38,630కు చేరుకుంది.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,15,525కి చేరుకోగా.. ఇప్పటి వరకు 22,92,396 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. మరోవైపు మృతుల సంఖ్య 14,708కి పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,421గా ఉంది.. తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 106, పశ్చిమ గోదావరిలో 99, కృష్ణా జిల్లాలో 77, విశాఖపట్నంలో 55 కేసులు నమోదు అయ్యాయి.

Exit mobile version