ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, ప్రస్తుతం కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి.. ఏపీలో తాజాగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 16కు పెరిగింది.. ఇక, ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. ఏపీలో గత 24 గంటల్లో 31,743 శాంపిల్స్ పరీక్షించగా.. 162 మందికి పాజిటివ్‌గా తేలింది.. ఇదే సమయంలో 186 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 3,12,62,099కు చేరగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,849కు పెరిగింది. ఇప్పటి వరకు 20,61,308 మంది రికవరీ అయితే.. 14,492 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,049 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.
ఏపీ కరోనా అప్‌డేట్..

COVID 19 AP