Site icon NTV Telugu

ఏపీ కరోనా అప్‌డేట్‌.. తగ్గిన కేసులు

COVID 19

COVID 19

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ కాస్త కిందకు దిగాయి.. రాష్ట్రవైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 82,297 శాంపిల్స్‌ పరీక్షించగా… 2,145 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో 24 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 2,003 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్..

తాజా మృతుల్లో ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు, కృష్ణా జిల్లాలో నలుగురు చొప్పున, కడప, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మృతిచెందారు.. ఇక, తాజా కేసులతో కలుపుకొని.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,73,246కు చేరగా.. 19,39,476 మంది డిశ్చార్జ్ అయ్యారు.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతిచెందినవారి సంఖ్య 13,468కు పెరిగింది… ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 20,302 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

Exit mobile version