NTV Telugu Site icon

ఏపీ కరోనా అప్‌డేట్‌.. భారీగా తగ్గిన కేసులు..

AP COVID 19

AP COVID 19

కరోనా కొత్త కేసులపై దసరా పండుగ ప్రభావం స్పష్టంగా కనిపించింది.. దేశవ్యాప్తంగా ఇవాళ కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.. దీనికి ప్రధాన కారణం టెస్ట్‌ల సంఖ్య తగ్గడమే.. ఇక, ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. ఏపీలోనూ టెస్ట్‌ల సంఖ్య భారీగా తగ్గిపోయింది.. కొత్త కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి.. బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,243 శాంపిల్స్‌ పరీక్షించగా.. 332 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఏడుగురు కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. కడప, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చనిపోయారు. ఇదే సమయంలో 585 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.

దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా నేటి వరకు కరోనా టెస్ట్‌ల సంఖ్య 2,89,54,134కు పెరిగింది.. ఇక, మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,60,040కు పెరగగా.. రివకరీ కేసులు 20,39,545కు చేరాయి.. ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి 14,302 మంది ప్రాణాలు కోల్పోగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,193గా ఉంది. తాజా కేసుల్లో చిత్తూరులో 55, కడపలో 43, గుంటూరులో 42 కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి.