NTV Telugu Site icon

ఏపీ కరోనా అప్‌డేట్‌.. మళ్లీ పెరుగుతోన్న కేసులు

COVID 19 AP

COVID 19 AP

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,350 శాంపిల్స్‌ పరీక్షించగా.. 540 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 10 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ప్రకాశం జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, చిత్తూరులో ఇద్దరు చొప్పున, తూర్పు గోదావరి, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇక, ఇదే సమయంలో 557 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.

దీంతో.. నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,88,79,945కు చేరగా.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 20,59,122కు చేరుకున్నాయి. రికవరీ కేసులు 20,38,248కు పెరగగా.. మృతుచెందిన కరోనా బాధితుల సంఖ్య 14,286కి ఎగిసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 6,588గా ఉన్నాయి.. తాజా కేసుల్లో చిత్తూరులో 120, గుంటూరులో 111 కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి.