Site icon NTV Telugu

Entrance Exams: ఏపీలో సెట్ పరీక్షలకు ఛైర్మన్‌లు, కన్వీనర్ల నియామకం

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఛైర్మన్‌లు, కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్‌ను మే నెలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈఏపీసెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ అనంతపురం యూనివర్సిటీకి అప్పగించారు. సెట్ కన్వీనర్‌గా విజయకుమార్‌ను నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత ఈఏపీసెట్‌ను కాకినాడ జేఎన్టీయూ నిర్వహిస్తుండగా.. అధికారులు ఈసారి మార్పు చేశారు. అటు ఈఏపీ సెట్ ఛైర్మన్‌గా రంగాజనార్ధన్‌ను నియమించారు.

Read Also: Unemployees: ఏపీ వ్యాప్తంగా నేడు నిరుద్యోగుల ఆందోళనలు

ఈసెట్ నిర్వహణ బాధ్యతలను కాకినాడ జేఎన్టీయూకు అప్పగించగా.. కన్వీనర్‌గా కృష్ణమోహన్, ఛైర్మన్‌గా ప్రసాదరాజును నియమించారు. ఐసెట్ నిర్వహణ బాధ్యతలను ఆంధ్రా యూనివర్సిటీకి అప్పగించగా.. కన్వీనర్‌గా కిషోర్‌బాబు, ఛైర్మన్‌గా ప్రసాదరెడ్డి వ్యవహరించనున్నారు. పీజీఈసెట్ నిర్వహణ బాధ్యతలను శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీకి అప్పగించగా.. కన్వీనర్‌గా ఆర్వీఎస్ సత్యనారాయణ, ఛైర్మన్‌గా రాజారెడ్డిని నియమించారు. ఆర్‌సెట్ నిర్వహణ బాధ్యతలను ఉన్నత విద్యామండలి పర్యవేక్షించనుంది. ఆర్‌సెట్ కన్వీనర్‌గా అప్పలనాయుడు, ఛైర్మన్‌గా హేమచంద్రారెడ్డి వ్యవహరిస్తారు. ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతలను పద్మావతి మహిళా యూనివర్సిటీకి అప్పగించగా… కన్వీనర్‌గా అమృతవల్లి, ఛైర్మన్‌గా జమునను నియమించారు. పీజీ సెట్ నిర్వహణ బాధ్యతలను యోగివేమన యూనివర్సిటీకి అప్పగించగా.. కన్వీనర్‌గా నజీర్ అహ్మద్, ఛైర్మన్‌గా సూర్యకళావతి వ్యవహరిస్తారు. లాసెట్ నిర్వహణ బాధ్యతలను పద్మావతి మహిళ యూనివర్సిటీకి అప్పగించగా.. కన్వీనర్‌గా సీతా కుమారి, ఛైర్మన్‌గా జమునను నియమించారు.

Exit mobile version