Site icon NTV Telugu

CM YS Jagan: పట్టణాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష.. కీలక వ్యాఖ్యలు

Ys Jagan

Ys Jagan

పట్టణాభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్‌.. గతంలో పరిస్థితులు, మెరుగుపడిన విధానం.. జీతాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. నగరాలు, పట్టణాల్లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లు ఆర్వోబీలను సత్వరమే పూర్తి చేయాలని.. అనుమతులు మంజూరైన చోట వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలి ఆదేశించారు.. ఇక, సీఆర్డీఏ పరిధిలోని పనుల పురోగతిని సమీక్షించిన సీఎంకు.. కరకట్ట రోడ్డు నిర్మాణం కొనసాగుతోందని వివరించారు అధికారులు.. క్వార్టర్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని.. సీడ్‌యాక్సిస్‌ రోడ్లలో నాలుగు గ్యాప్స్‌ను పూర్తిచేసే పనులు మొదలవుతాయన్న అధికారులు.

Read Also: Agnipath Notification: వెనక్కి తగ్గని కేంద్రం.. అగ్నిపథ్​ నోటిఫికేషన్ విడుదల

ఇక, జులైలో కొత్తగా మహిళా మార్టులను ఏర్పాటు చేస్తున్నామన్న సీఎంకు వివరించారు అధికారులు.. ఇప్పటికే 6 చోట్ల ప్రారంభం అయినట్టు తెలిపారు.. అయితే, పైలెట్‌ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన మార్టులను సమీక్ష చేయాలని.. సమర్ధవంతంగా నడిచేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం.. మరోవైపు, విజయవాడలో కాల్వల సుందరీకరణపై నివేదిక ఇవ్వాలన్నారు.. పంటకాల్వల్లో చెత్త , ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయకుండా తగిన చర్యలు తీసుకోవలని, పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేవారు.. మ్యాపింగ్‌ చేసి కొన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టి, అక్కడ పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు సీఎం జగన్‌.

సమగ్రమైన పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వగలుతామని స్పష్టం చేశారు సీఎం జగన్‌.. ఇందులో సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని.. అందుకే జీతాలు పెంచామని గుర్తుచేశారు.. ఈ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలలకే మున్సిపల్‌ పారిశుద్ధ్య సిబ్బంది జీతాన్ని 50 శాతం పెంచింది. రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచాం.. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో వారిని ఎవ్వరూ పట్టించుకోలేదని.. వారు చేస్తున్న పనులను చూసి, చలించి వారికి రూ.18 వేల జీతాన్ని అధికారంలోకి రాగానే ఇచ్చామని గుర్తుచేశారు. ప్రజారోగ్యం కోసం వారు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు, ఈ పనులను ఎవ్వరూ కూడా చేయలేరని అభినందించారు.. 2015 నుంచి 2018 సెప్టెంబరు వరకూ మున్సిపల్‌ పారిశుద్ధ్య సిబ్బంది జీతం కేవలం రూ.10 వేలు మాత్రమే ఉండేదని.. 2019 ఎన్నికలకు కేవలం 4 నెలల ముందు వారి జీతం రూ.10 వేల నుంచి రూ.12 వేలు చేశారని.. కానీ, ఐదేళ్లపాటు చంద్రబాబు నెలకు ఇచ్చింది కేవలం రూ.10 వేలు మాత్రమేనని మండిపడ్డారు. మనం వచ్చిన తర్వాత వారి జీతం రూ.18 వేలు చేశామని తెలిపారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.

మరోవైపు, నగరపాలక, పురపాలక సంస్థల్లో 4,396.65 కిలోమీటర్ల మేర రోడ్లు కోసం రూ.1826.22 కోట్లు ఖర్చుచేస్తున్నామని, ఇప్పటికే 55.15 శాతం పనులు పూర్తయ్యాయని సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు అధికారులు.. అయితే, ఎయిర్‌పోర్టుల నుంచి నగరాలకు వెళ్లే రహదారులను సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు.. పట్టణాభివృద్ధిశాఖపై సమీక్షలో టిడ్కో ఇళ్లను పూర్తిచేసి, నిర్దేశించుకున్న సమయంలోగా అందించాలని సూచించారు సీఎం. కాలనీల్లో మౌలిక సదుపాయాల పనులు వేగంగా జరుగుతున్నాయన్న అధికారులు. గడచిన 3 ఏళ్లలో టిడ్కో ఇళ్లకోసం రూ.4500 కోట్లు ఖర్చుచేశామని తెలిపారు.

Exit mobile version