NTV Telugu Site icon

YS Jagan Mohan Reddy: గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌.. వెంటనే ఆ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు

Ys Jagan

Ys Jagan

నిరుద్యోగులకు మరోసారి గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. విద్యాశాఖపై ఇవాళ సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. గోరుముద్ద, సంపూర్ణ పోషణ, స్కూళ్లలో నాడు – నేడు, ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై చర్చించారు.. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, ఉషశ్రీ చరణ్, సీఎస్ సమీర్ శర్మ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈవో, డిప్యూటీ డీఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.. ఇక, క్రమం తప్పకుండా మధ్యాహ్నం భోజనం పై పర్యవేక్షణ ఉండాలని.. దీని కోసం సరైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలని స్పష్టం చేశారు.

Read Also: Nara Chandrababu Naidu: కుప్పంలో రౌడీయిజం చేస్తున్నారు.. వేషాలు వేస్తే పులివెందుల వరకు తరుముతాం..!

ఇక, స్కూళ్లు, అంగన్‌వాడీలకు బియ్యాన్ని సరఫరా చేసే ముందు బియ్యం నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలని ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్.. నాడు– నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో సదుపాయాల భద్రత కోసం వాచ్‌మ్యాన్‌ నియమించాలని సూచించిన ఆయన.. స్కూళ్ల నిర్వహణ పై ఒక కాల్‌ సెంటర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని స్పష్టం చేశారు.. స్కూళ్ల నిర్వహణ పై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ సూపర్‌ వైజర్లు, అంగన్‌వాడీ వర్కర్, హెల్పర్ల పోస్టులను కూడా భర్తీచేయాలని ఆదేశాలు జారీ చేశారు.. అంటే.. ముఖ్యమంత్రి ఆదేశాలతో.. రాష్ట్రంలోని ఎంఈవో, డిప్యూటీ డీఈవో పోస్టులతో పాటు.. అంగన్‌వాడీ సూపర్‌ వైజర్లు, అంగన్‌వాడీ వర్కర్, హెల్పర్ల పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేయనున్నారు అధికారులు.