Site icon NTV Telugu

YS Jagan mohan Reddy: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సీఎం.. వారికి కూడా ఆర్థిక సాయం..

Ys Jagan Mohan Reddy

Ys Jagan Mohan Reddy

వివిధ సంక్షేమ పథకాలతో అర్హులకు ఫలాలు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. పథకాల అమలులో.. కులం, మతం, పార్టీ చూడకుండా అందిస్తామని ఎన్నోసార్లు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, అర్హతలు ఉండి కూడా ప్రభుత్వ పథకాలు అందనివారు కూడా ఉన్నారు.. దీంతో వారికోసం కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం వైఎస్‌ జగన్.. అర్హులై సంక్షేమ పథకాలు అందని రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. అర్హులై వివిధ కారణాల వల్ల ప్రభుత్వ పథకాలు పొందలేక పోయిన వారికి లబ్ది చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అర్హులై సంక్షేమ పథకాలు అందని వారికి ఇవాళ ఆర్థిక సాయం చేయనున్నారు సీఎం జగన్‌. దీనిపై ఏటా డిసెంబర్, జూన్ నెలలో సమీక్ష చేపట్టాలని నిర్ణయించారు సీఎం జగన్. ఆ మేరకు ఇవాళ 3,39,096 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సహాయం చేయనున్నారు.

Read Also: Tamilisai Soundararajan: నేడు యానాంకు తమిళిసై.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

అర్హలై సంక్షేమ ఫలాలు అందనివారిని 3,39,096 మందిని గుర్తించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇవాళ వారికి ఆర్థికసాయం చేయనున్నారు.. రూ.137 కోట్లను వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్మోహన్‌రెడ్డి.. ఇక, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద కొత్తగా 2,99,085 మందికి ప్రయోజనం చేకూర్చనున్నారు.. ఏటా రూ. 935 కోట్ల అదనపు వ్యయంతో కొత్త సామాజిక పెన్షన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు… కొత్తగా మంజూరు చేస్తున్న 7,051 బియ్యం కార్డులతో కలిపి ఇప్పటి వరకు 1,45,47,036 బియ్యం కార్డులు మంజూరు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.. రేపు కొత్తగా 3,035 డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులు అందించనున్నారు..

Exit mobile version