ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. రాజకీయ పార్టీలు అన్నీ దూకుడు చూపిస్తున్నాయి.. పొత్తులపై ఎవరి ప్రయత్నాలు, ఎవరి ఆశలు వారికి ఉన్నాయి.. ఈ సమయంలో.. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తనకు ఎవరితోనూ పొత్తులేదని.. తనకు కేవలం జనంతో మాత్రమే పొత్తు అని చెప్పారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించిన సీఎంకు.. ఘన స్వాగతం లభించింది.. ఓవైపు ప్రజలు, మరోవైపు పార్టీ శ్రేణులు.. భారీ ఎత్తున స్వాగతం పలికారు.. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి వెళ్తున్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు దారి పొడవునా అభివాదాలు చేస్తూ కనిపించారు ప్రజలు..
Read Also: Pradeep Ranghnadhan: కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇస్తే పెట్రోల్ కు డబ్బులు లేవు అన్నాడట
ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో మాట్లాడిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విపక్షాలపై సెటైర్లు వేస్తూనే.. పొత్తులపై క్లారిటీ ఇచ్చారు.. మీ బిడ్డ నమ్ముకున్నది ఎవరినంటే..? దేవుడి నమ్ముకుంటాడు.. ఆ తర్వాత మిమ్మల్ని నమ్ముకుంటాడు అంటూ సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.. మీ బిడ్డకు పొత్తు ఎవరితో ఉంటుంది అంటే.. అది మీతోనూ ఉంటుందన్నారు. మీ బిడ్డకు వీళ్ల మాదిరగా దత్తత పుత్రుడి లాంటివాడు తోడు ఉండకవపోవచ్చు.. కానీ మీ బిడ్డకు నిజాయితి ఉందని తెలిపారు.. మరోవైపు, మహిళలను దగా చేసిన చంద్రబాబు మహిళా సాధికారత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యారు.. అధికారంలో ఉన్నప్పు డు బీసీ, ఎస్సీ , ఎస్టీ, మైనార్టీలను దగా చేసి.. నేడు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్య క్తం చేశారు. ఇక, జగనన్న విద్యా దీవెన పథకం కిం ద విద్యా ర్థులకు జూలై–సెప్టెం బర్ త్రైమాసికం నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల అన్న మయ్య జిల్లా మదనపల్లెలో నిర్వ హించిన కార్య క్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యా ర్థుల తల్లుల ఖాతాల్లోరూ.694 కోట్లు జమ చేశారు..
కుటుంబాల తలరాత మారాలన్నా .. పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గం అని స్పష్టం చేశారు సీఎం జగన్.. పేదరికం చదువులకు అవరోధం కావొద్దని దివం గత నేత వైఎస్సార్ ఫీజురీయింబర్స్ మెంట్ పథకం తెచ్చా రు. ప్రతి విద్యా ర్థి
తలరాత మార్చా లని తపన పడ్డారు. ఆతర్వా త ప్రభుత్వా లు ఫీజురీయిం బర్స్ మెంట్‌ను నీరుగార్చాయి అని మండిపడ్డారు.. పాదయాత్రలో విద్యా ర్థుల కష్టాలు నేరుగా చూసి అధికారంలోకి రాగానే జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజురీయింబర్స్ మెం ట్ చెల్లిస్తున్నాం స్పష్టం చేశారు.. పాలనలో తేడాను గమనించాలని ప్రజలకు సూచించారు.. ప్రతిపక్షాలకు వివేకం రావాలని కోరుకుంటున్నా. నా భూముల్లోనే రాజధాని కట్టాలనే ఆలోచన నుంచి బయటపడే.. దేవుడు బుద్ది, జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నా . సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదించే వారికి జ్ఞానం రావాలి.. తప్పుడు ప్రచారం చేసేవారికి ఇంగిత జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.