NTV Telugu Site icon

కొత్త ప్రతిపాదనలతో ఒక్క స్కూలు కూడా మూత‌ప‌డొద్దు-సీఎం జ‌గన్

YS Jagan

కొత్తగా చేస్తున్న ప్రతిపాదనల వల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడ‌ద‌ని అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి… మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అంగన్‌వాడీ ఉపాధ్యాయుల కోసం రూపొందించిన స్పోకెన్‌ ఇంగ్లీష్‌ పుస్తకం, సీడీల‌ను ఆవిష్కరించిన సీఎం‌.. అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీ శిక్షణ కోసం రూపొందించిన కరదీపిక నమూనాను ప‌రిశీలించారు.. విద్యార్థులు-టీచర్ల నిష్పత్తి సర్దుబాటుకు పలు ప్రతిపాదనలు చేశారు.. పిల్లలు తక్కువుగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ పిల్లలను కలిపే విధంగా కార్యాచరణ రూపొందించాల‌ని సూచించారు.. అవసరమైన చోట్ల మూడు నుంచి ఐదో తరగతి వరకూ కూడా హైస్కూల్‌ పరిధికి తీసుకురావాలని ప్రతిపాదనలు చేశారు.. అవసరమైన చోట అప్పర్‌ప్రైమరీ స్కూళ్లను హైస్కూళ్లగా మార్చే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు.. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

మనిషిని కష్టపెట్టి, బాధపెట్టి.. ఏం సాధించలేం అన్నారు సీఎం వైఎస్ జ‌గ‌న్… అసహనం ఎప్పుడూ కూడా బయటకు రానివ్వకూడద‌న్న ఆయ‌న‌.. మనం తీసుకుంటున్న విప్లవాత్మక మార్పుల్లో టీచర్ల పాత్ర కీలకంగా ఉంటుంద‌న్నారు.. స్కూళ్ల‌ నిర్వహణలో జాతీయ ప్రమాణాలు పాటించాల‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. పిల్లలకు 2 కిలోమీట‌ర్ల దూరం లోపలే బడి ఉండాల‌న్నారు.. అంగన్‌వాడీ టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాల‌ని సూచించిన ఏపీ సీఎం.. పెద్దవాళ్ల పిల్లల మాదిరిగా పేదవాడి పిల్లలు కూడా ఇంగ్లీషులో మంచి విద్యను అందుకోవాల‌ని తెలిపారు.