ఏపీ సీఎం జగన్ బుధవారం బిజీ బిజీగా గడపనున్నారు. కరోనా పరిస్థితులపై మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ నేతలు, మంత్రులతో ఆయన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ వన్ టౌన్‌లో షా జహూర్ ముసాఫిర్ ఖానా ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ముస్లిం మత పెద్దలతో సమావేశం అవుతారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఇఫ్తార్ విందులో సీఎం జగన్ పాల్గొంటారు. గంటన్నర పాటు ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన గడపనున్నారు. రాత్రి 7:30 గంటలకు మంగళగిరి చేరుకుని గుంటూరు జడ్పీ ఛైర్‌పర్సన్ క్రిస్టినా కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు.
కాగా ఈరోజు వైపీపీ నేతలతో జగన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి ముందుకెళ్లేలా ఉమ్మడి కార్యాచరణను జగన్ రూపొందించనున్నారు. ప్రతి ఎమ్మెల్యే వారానికి కనీసం 10 గ్రామ లేదా వార్డు సచివాలయాలను సందర్శించడంతో పాటు వాటి పనితీరును సమీక్షించేలా కార్యక్రమాన్ని రూపొందించి వచ్చేనెల నుంచి కచ్చితంగా పాటించేలా దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. మే 2 నుంచి గడప గడపకు వైసీపీ అనే కార్యక్రమాన్ని తొలివిడతగా చేపట్టనున్నట్లు సమాచారం అందుతోంది.
YSRCP: సజ్జల, విజయసాయిరెడ్డికి అదనపు బాధ్యతలు.. ఉత్తర్వులు విడుదల
