Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Andhra Pradesh Cabinet Meeting Ends By Taking Key Decisions

ఏపీ కేబినెట్‌.. కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం

Published Date :January 21, 2022 , 6:44 pm
By Sudhakar Ravula
ఏపీ కేబినెట్‌.. కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం
  • Follow Us :
  • google news
  • dailyhunt

సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ స‌మావేశం జ‌రిగింది.. దాదాపు 2 గంట‌ల‌కు పైగా జ‌రిగిన ఈ స‌మావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం ల‌భించింది.. రాష్ట్రంలో ప్ర‌స్తుతం కోవిడ్ ప‌రిస్థితితో పాటు.. ఉద్యోగుల పీఆర్సీ, హెచ్ఆర్ఏ స‌హా ప‌లు అంశాల‌పై చ‌ర్చ సాగ‌గా.. కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది కేబినెట్‌..

  • రాష్ట్రంలో కోవిడ్‌ విస్తరణ, తీసుకుంటున్న చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జ‌రిగింది.. కోవిడ్‌ నివారణా చర్యలను మంత్రివర్గానికి వివ‌రించారు అధికారులు.
  • ఈబీసీ నేస్తానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. ఈ నెల 25న ఈబీసీ నేస్తం పథకం ప్రారంభం కాబోతోంది.. ఏడాదికి రూ.15వేలు చొప్పున మూడేళ్లలో రూ.45వేలు ఇవ్వ‌నున్నారు.. ఈబీసీల్లో 45–60 ఏళ్ల మధ్యనున్న అర్హులైన మహిళలకు ఈ ప‌థ‌కం వ‌ర్తింప‌జేయ‌నున్నారు.. మొత్తం 3,92,674 మంది మహిళలకు లబ్ధి చేకూర‌నుండ‌గా.. దీనికోసం రూ.589.01 కోట్లు వెచ్చించ‌నుంది ప్ర‌భుత్వం.
  • 16 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి రూ.7880 కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. రూ.3820 కోట్లతో పాత మెడికల్‌ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రులు పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు పరిపానలపరమైన అనుమతులకు కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.
  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
  • 11వ పీఆర్సీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
  • కోవిడ్‌ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాల కోసం కారుణ్య నియామకాలకు కేబినెట్‌ ఆమోదం వేసింది.. వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వ‌నున్నారు.. జూన్‌ 30 లోగా నియామకాలు చేపట్టాలని నిర్ణ‌యించారు.
  • జగనన్నస్మార్ట్‌టౌన్‌షిప్స్‌లో 10 శాతం స్థలాలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు రిజర్వ్ ఫెన్షనర్లకు 5 శాతం స్ధలాలు రిజర్వ్ , ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్.. 20శాతం రిబేటుతో ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాల‌కు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.
  • ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు 8 అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
    *ఆయుష్‌ విభాగంలో నేచురోపతి, యోగా డిస్పెన్సరీల్లో 78 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం వేసింది.. 26 డిస్పెన్సరీల్లో ముగ్గురు చొప్పున 78 పోస్టులు భ‌ర్తీచేయ‌నుంది.
  • మున్సిపాల్టీగా మారిన వైయస్సార్‌ తాడిగడపలో పంచాయతీగా ఉన్నప్పుడు ఉన్న 59 పోస్టులను మున్సిపాల్టీలో బదిలీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
  • కర్నూలు జిల్లా డోన్‌లో బాలికల బీసీ గురుకుల పాఠశాల మరియు జూనియర్‌ కాలేజీ, బేతంచర్లలో బాలుర గురుకుల పాఠశాలలకు 58 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.
  • కృష్ణపట్నం పవర్‌ ప్లాంట్‌ ఆపరేషనల్‌ మెయింటైనెన్స్‌ బాధ్యతలను వేరొకరికి అప్పగించేందుకు అవసరమైన బిడ్డింగ్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 25 ఏళ్ల పాటు ఓ అండ్‌ ఏం (ఆపరేషనల్‌ అండ్‌ మెయింటైనెన్స్‌) కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.. అందులో పనిచేసే జెన్‌కో ఉద్యోగులను తిరిగి జెన్‌కోలోకి వచ్చేందుకు వెసులుబాటు క‌ల్పించ‌నున్నారు. వరుస నష్టాలు చవిచూస్తున్న కృష్టపట్నం థర్మల్‌ ప్లాంట్‌. కిలోవాట్‌ కోసం అవుతున్న ఖర్చు రూ.3.14.. దాని పక్కనే ఉన్న మరో పవర్‌ ప్లాంట్‌లో కి లోవాట్‌ ఉత్పత్తికి అవుతున్న ఖర్చు రూ.2.34.. ఈ నేపధ్యంలో ఆపరేషనల్‌ ఖర్చులు తగ్గించుకునేందుకు నిర్వహణ హక్కులు వేరొకరికి అప్పగించడానికి ఓ అండ్‌ ఎం కోసం బిడ్డింగ్‌కు ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది.
  • జనవరి 1, 2022 నుంచి పెన్షన్‌ను 2,250 నుంచి రూ.2500కు పెంచిన నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
  • ఏపీఐఐసీ నోడల్‌ ఏజెన్సీగా ఆటోనగర్లలో ఉన్న భూములను బహుళ అవసరాలకు వినియోగించేకుందుకు అవసరమైన గ్రోత్‌ పాలసీకి కేబినెట్‌ ఆమోదం ల‌భించింది.
  • ధాన్యం కొనుగోళ్లు కోసం… ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ రూ.5వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు కేబినెట్‌ అనుమతి.. రైతుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూసేందుకు నిర్ణయం. ఈ సీజన్‌లో 50 లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యం.
    ఇప్పటివరకు 21.83 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ, 21 రోజుల్లో రైతులకు రూ.2150 కోట్ల చెల్లింపులు జ‌రిగాయి.
  • విశాఖ జిల్లా ఎండాడలో రాజీవ్‌ గృహ కల్ప ప్రాజెక్టులో నిరుపయోగంగా ఉన్న భూములను హెచ్‌ఐజీ, ఎంఐజీ కాలనీలకోసం వాడుకునేందుకు కేబినెట్‌ ఆమోదం.
  • తిరుపతిలో స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌కు 5 ఎకరాల స్థలం.. అకాడమీ పెట్టేందుకు స్థలం ఇస్తూ కేబినెట్‌ నిర్ణయం.
  • ఆచార్య ఎన్జీ రంగా యూనివర్శిటీ పరిధిలో అనకాపల్లిలో రీజనల్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ ( రార్స్‌)కు ఉచితంగా భూమి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.. రీజనల్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(రార్స్‌)కు 50 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌.
  • ఎండో మెంట్‌ చట్టం – 1987 కి సవరణలతో ఆర్డినెన్స్‌ జారీకి కేబినెట్‌ ఆమోదం.. దీనిద్వారా టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించి సవరణలు తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయం.
  • ఓటీఎస్‌ ఇళ్లు, టిడ్కో, విశాఖలోని మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీస్‌కి స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీ మినహాయింపులకు కేబినెట్‌ ఆమోదం
  • ఐసీడీఎస్‌కు బాలమృతం, ఫోర్టిఫైడ్‌ ఆహారం, తాజా పాలు అమూల్‌ నుంచి సరఫరాకు కేబినెట్‌ ఆమోద.. ఏపీడీడీసీఎఫ్‌ ద్వారా సరఫరా చేయనున్న అమూల్‌.
  • మీట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో 7 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం
  • శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో 13 పోస్టులు మంజూరుకు ఆమోదం
  • జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో స్వల్ప మార్పులు చేసిన ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రెండు వాయిదాల్లో ఓటీఎస్‌ కట్టే వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం, ఉగాది, దీపావళి రెండు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటుకు కేబినెట్‌ ఆమోదం.
  • ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్రంలో తాజా వ్యవసాయ పరిస్థితులపై మంత్రివర్గసమావేశంలో చర్చ… వ్యవసాయ అనుబంధ రంగాల్లో గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌ (జీజీఐ)లో ప్రథ‌మ స్ధానంలో నిల్చిన ఆంధ్రప్రదేశ్‌.. వ్యవసాయరంగంలో 11.3 శాతం, ఉద్యానవన రంగంలో 12.3 శాతం, పశుసంవర్ధకశాఖలో 11.7 శాతం, మాంసం ఉత్పత్తిలో 10.3 శాతం అభివృద్ధి సాధించిన ఏపీ.. దీంతో పాటు క్రాప్‌ ఇన్సూరెన్స్‌లో అనుసరించిన వినూత్న విధానాలతో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మిగిలిన రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిల్చిందని కేబినెట్‌లో వివరించిన అధికారులు.
  • ఉద్యానవనశాఖలో అను

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap Cabinet
  • AP Cabinet Decisions
  • CM YS Jagan
  • YSRCP

తాజావార్తలు

  • DC vs GT: నేడు ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్.. రెడీ అవుతోన్న వరుణుడు.. ఢిల్లీలో వాతావరణం ఎలా ఉండబోతోంది?

  • Jailer2 : ఒకే ఫ్రేమ్‌లో నలుగురు సూపర్ స్టార్స్..

  • Ranjan : కోర్ట్ తమిళ రీమేక్.. వెండితెర ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు

  • Hormuz Strait: చమురు కష్టాలకు బ్రేక్.. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!

  • The Paradise : నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ పోస్ట్ పోన్?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions