Andhra Pradesh: కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాకు డా.బీఆర్.అంబేద్కర్ పేరును ఖరారు చేస్తూ ఆమోదముద్ర వేసింది. దీంతో ఇకపై కోనసీమ జిల్లా డా.బీఆర్.అంబేద్కర్ జిల్లాగా మారనుంది. కేబినెట్‌లో 32వ అంశంగా కోనసీమ జిల్లా పేరును కేబినెట్ ప్రతిపాదించింది. ఇటీవల కోనసీమ జిల్లా మార్పు అంశంపై అమలాపురంలో తీవ్ర ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు కోనసీమ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుచేయడమే కాకుండా ఇంటర్నెట్‌ను కూడా అధికారులు నిలిపేశారు. అమలాపురం అల్లర్ల ఘటనలో దాదాపు 150 మందిపై కేసులు నమోదయ్యాయి. పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కూడా జరిపారు.
కాగా ప్రభుత్వం తాజా నిర్ణయంతో కోనసీమ జిల్లా వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లాలో 1300 మంది పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశారు. మరోవైపు కోనసీమ జిల్లా అదే పేరు కొనసాగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండేందుకు స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో 12 పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌లన్నింటిపై కలిసి విచారించాలని కోర్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా పేరు అంశంపై జిల్లా వాసుల నుంచి అభిప్రాయసేకరణ కూడా పూర్తి చేసింది.
Also Read
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్‌ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!