AP Bifurcation Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కేసు విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు… ఈ రోజు కోర్టు సమయం ముగిసిపోవడంతో బెంచ్‌పైకి విచారణకి రాలేదు ఏపీ విభజన కేసు.. కాగా, రాష్ట్ర విభజన పై గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, తెలంగాణ వికాస కేంద్ర తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. రాష్ట్ర విభజన కేసు ఈరోజు విచారణకు రాకపోవడంతో కేసు విచారణ అంశాన్ని ప్రస్తావించారు పిటిషనర్ ఉండవల్లి అరుణ్‌కుమార్.. విభజన పిటిషన్లను వచ్చే మంగళవారం విచారణ జాబితా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది జస్టిస్ కేఎం జోసెఫ్ , జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం..
Read Also: RCB : ధోనీ రికార్డును రాత్రికి రాత్రే లేపేసిన ఆర్‌సీబీ
కాగా, ఏపీ విభజనకు సంబంధించి నమోదైన పలు పిటిషన్లను ఏప్రిల్11న విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 22వ తేదీన స్పష్టం చేసింది. విచారణ చేపట్టిన జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని, దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య చాలా సమస్యలు తలెత్తుతున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర విభజన జరగాలంటే.. కొన్ని ప్రత్యేక పరిస్థితులు, నియమ నిబంధనలు అవసరమని, ఆ మేరకు కేంద్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. అయితే, ఫిబ్రవరి 22, 2023న సుప్రీంకోర్టు.. ఏప్రిల్ 11వ తేదీకి విచారణ వాయిదా వేసినా.. ఈ రోజు ఎలాంటి విచారణ జరగకుండా వచ్చే మంగళవారానికి వాయిదా పడింది.
