NTV Telugu Site icon

Agricultural Growth Rate: ఏపీలో పెరిగిన వ్యవసాయ వృద్ధిరేటు.. నంబర్‌ వన్‌ టార్గెట్..

Agricultural

Agricultural

Agricultural Growth Rate: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ వృద్ధిరేటు పెరిగింది.. ఇక, నంబర్‌ వన్‌ టార్గెట్‌ అంటున్నారు అధికారులు.. దీనిపై ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాయలం పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ.. వ్యవసాయపరంగా రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే తమ యూనివర్సిటీ లక్ష్యంగా తెలిపారు.. కడప సమీపంలోని ఊటు­కూరు వ్యవసాయ పరిశోధనస్థానంలో నిర్వహించిన కిసాన్‌మేళాలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధిరేటు 8 శాతం పెరిగిందని వెల్లడించారు.. బోధన, పరిశోధన, విస్తరణ లక్ష్యంగా ఎన్జీరంగా విశ్వవిద్యాలయం పనిచేస్తోందని తెలిపారు.

Read Also: Cheddi Gang: అమ్మో మళ్లీ వచ్చారు.. మహబూబ్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ వృద్ధిరేటు 8 శాతం పెరిగింది.. ప్రగతిపరంగా దేశంలోనే మన రాష్ట్రం 11వ స్థానంలో నిలిచిందని తెలిపారు డాక్టర్‌ ప్రశాంతి… అయితే, ఏపీని నంబర్‌వన్‌గా నిలిపేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. 2022లో అత్యున్నత స్కోచ్‌ అవార్డు కూడా సాధించామని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న ఆమె.. డ్రోన్‌ టెక్నాలజీలో డీసీజీఏ సర్టిఫికెట్‌ సైతం కైవసం చేసుకున్నామని వెల్లడించారు.. కాగా, సుపరిపాలన సూచిక (గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌-జీజీఐ)లో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధిలో ఏపీ భారీ పురోగతి సాధించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జీజీఐ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్ర వార్షిక వృద్ది రేటు- 2020-21లో 11.3 శాతంగా నమోదయింది. 2019లో ఇది కేవలం 6.3 శాతంగా ఉంది.. రెండేళ్లలోనే అనూహ్యంగా పెరిగింది. ఆహార, వాణిజ్య పంటలతో పాటు ఉద్యానవనాలు, పాడిపరిశ్రమ, ఇతర అనుబంధరంగాలకు సంబంధించిన ఉత్పత్తులు, ఎగుమతులు భారీగా పెరగటమే దీనికి కారణంగా చెబుతున్నారు..