Site icon NTV Telugu

Anathapuram Priest: కామ పూజారి.. కళ్లన్నీ మహిళా భక్తులపైనే..!!

Ananthapuram Priest

Ananthapuram Priest

Anathapuram Priest: సమాజంలోని గౌరవప్రదమైన వృత్తుల్లో అర్చకత్వం కూడా ఒకటి. అర్చకులు, పురోహితులకు సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. భక్తులు ఆలయానికి వెళ్లి అర్చకుడితో పూజలు చేయించుకుని ఆయన కాళ్లకు మొక్కుతారు. అయితే కొందరు అర్చకత్వం ముసుగులో ఆ వృత్తి విలువలకు కళంకం తెస్తున్నారు. తులసి వనంలో గంజాయి మొక్కల తరహాలో ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిలో అనంతపురం జిల్లాకు చెందిన అనంత శయన అనే పూజారి ఉన్నాడు. ఆలయానికి పూజల కోసం వచ్చే యువతులను టార్గెట్ చేయడమే అతడి పని. వాళ్లు తమ సమస్యలను దేవుడికి చెప్పుకుందామని ఆలయానికి వస్తే.. కామంతో వాళ్లపై కన్నేస్తూ అనంత శయన కామ క్రీడలు కొనసాగిస్తున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా హీరేహాల్ మండలం మురిడి గ్రామానికి చెందిన అనంత శయన స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి 14 ఏళ్ల క్రితమే కర్నూలు జిల్లా బేతంచర్లకు చెందిన స్రవంతితో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మురిడి ఆంజనేయస్వామి ఆలయానికి ప్రజల్లో మంచి పేరు ఉంది. ఇక్కడ మొక్కుకుంటే ఎలాంటి కోరికలైనా తీరతాయని భక్తుల నమ్మకం. అందుకే పక్కన ఉండే కర్ణాటకతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ఆలయానికి తరలివస్తుంటారు. అయితే నోరు మంత్రాలు చదువుతున్నా అనంత శయన కళ్లన్నీ అందమైన మహిళా భక్తులపైనే ఉంటాయి. ఆలయానికి వచ్చే చాలా మంది మహిళలను పూజల పేరుతో అనంత శయన వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

అయితే ఆధారాలు లేకపోవడంతో అనంత శయనను ఆలయ కమిటీ ఏం చేయలేకపోయింది. కొంతమంది మహిళా భక్తులను తనదైన రీతిలో వశీకరణం ప్రయోగించి వారితో కామక్రీడలు జరిపినట్లు కూడా అనంతశయనపై అభియోగాలు ఉన్నాయి. అనంత శయన వ్యవహారం భార్య స్రవంతికి తెలియడంతో ఆమె నిలదీసింది. ఈ మేరకు కొన్ని ఫోటోలు, ఆడియో రికార్డులు కూడా ఆమె సంపాదించింది. దీనిపై నిలదీయగా చంపేస్తానని అనంత శయన బెదిరించాడని స్రవంతి చెప్తోంది. ఏడాది కిందట తనను పుట్టింటికి పంపించేశాడని ఆమె ఆరోపించింది. విడాకుల నోటీస్ కూడా పంపడంతో తనను చంపేందుకు కూడా అనంత శయన ప్రయత్నించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బయటపడింది.

Exit mobile version