YSRCP: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం తాత్కాలికంగా వాయిదా పడింది. ఇవాళ తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాటు చేశారు. జిల్లాలో మంత్రుల పర్యటన దృష్ట్యా వాయిదా వేసుకోవాలని తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి కోరారు. ఈ నెల 18 లేదా ఆ తర్వాత కార్యక్రమం నిర్వహించుకోవచ్చని సూచనలు చేశారు. ఇక, పోలీసుల సూచనతో వైసీపీ సమావేశం ఈనెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: S Jaishankar: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి జిన్‌పింగ్‌ను కలిసిన జైశంకర్..
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 18వ తేదీన తాడిపత్రిలో వైఎస్సార్ సీపీ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు.. తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు. ఈ రోజు వైసీపీ సమావేశాన్ని నిర్వహించాలని భావించాం.. మంత్రుల పర్యటన కారణంగా వాయిదా వేసుకోవాలని తాడిపత్రి ఏఎస్పీ లేఖ రాశారు.. పోలీసుల సూచనలు గౌరవించి.. తాడిపత్రి వైసీపీ సమావేశాన్ని 18వ తేదీకి వాయిదా వేశామని పెద్దారెడ్డి వెల్లడించారు.
Read Also: IB Executive Recruitment 2025: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 జాబ్స్.. ఈ అర్హతలుంటే అస్సలు వదలొద్దు
మరోవైపు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో మూడవ అతి పెద్ద పార్టీగా వైసీపీ అవతరించిందన్నారు. వైసీపీ ఏమైనా ఎల్టీటీఈ, జైషే మహమ్మద్ లాంటి నిషేధిత ఉగ్రవాద పార్టీ కాదు అని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులు పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం సహకరించాలి అని కోరారు.
