Site icon NTV Telugu

Karumuri Venkata Reddy Arrest: మరో వైసీపీ నేత అరెస్ట్.. అసలు కారణం ఏంటి..? అని అంబటి ఫైర్‌

Karumuri Venkata Reddy Arre

Karumuri Venkata Reddy Arre

Karumuri Venkata Reddy Arrest: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్‌ చేశారు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు.. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని వెంకట రెడ్డి ఇంటికి వెళ్లిన తాడిపత్రి పోలీసులు.. ఆయన్ని అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు.. అయితే, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్‌ చేయడం ఏంటి అంటూ వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పోలీసుల తీరుపై వెంకటరెడ్డి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. మరోవైపు. ఈ వ్యవహారంపై స్పందించిన వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వం, పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేశారని ఆయన విమర్శలు గుప్పించారు.

Read Also: Sharwanand : శర్వానంద్ కెరీర్ ను డిసైడ్ చేయనున్న బైకర్..

తాడిపత్రికి ఆయనను తీసుకెళ్లారని సమాచారమొస్తోన్నా, అరెస్టుకు సంబంధించిన కారణాలను పోలీసులు వెల్లడించకపోవడం దారుణమని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటరెడ్డిపై కక్ష పెట్టుకుని అరెస్టు చేశారు. ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉందో లేదో ప్రభుత్వం పరిశీలించాలి. కానీ నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం భయంకరమైన ధోరణి అని అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసులకు సమాధానం అడిగినా స్పందించకపోవడం ఆందోళనకరం అన్నారు.. ఇక, టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణకు వెళ్తున్న సమయంలో మరణించిన సీఐ సతీష్ కుమార్ ఘటన కూడా అనుమానాస్పదమేనని అంబటి పేర్కొన్నారు. అది హత్యా? ఆత్మహత్యా? ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ఆ విషయాన్ని ఎవరైనా మాట్లాడినా అరెస్టు చేస్తారా? అని మండిపడ్డారు..

చంద్రబాబు–లోకేష్ చెప్పితేనే అరెస్టులా? అని నిలదీశారు అంబటి రాంబాబు.. ప్రస్తుతం పోలీసులు రాజకీయ ఆదేశాలకే లోబడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ చెప్పితేనే అరెస్టు చేస్తున్నారా? రాజకీయ నాయకులు మాట్లాడకూడదా?” అని అంబటి ప్రశ్నించారు. సిట్ అధికారులు ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ నేతల మాటనే శాసనంలా తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. న్యాయస్థానాలు పలుమార్లు హెచ్చరించినా మరి కొంతమంది పోలీసు అధికారులలో మార్పు రాలేదని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. వెంకటరెడ్డిని ఎందుకు అరెస్టు చేశారో, ఎప్పుడు కోర్టులో హాజరు పరుస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు..

Exit mobile version