NTV Telugu Site icon

Anantapur Crime: దారుణం.. ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు.. ట్విస్ట్‌ ఏంటంటే..?

Anantapur Crime

Anantapur Crime

Anantapur Crime: ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది.. వివాహేతర సంబంధంతో సహజీవనం చేస్తున్న పార్వతి అనే మహిళపై ప్రియుడు మోహన్ పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో తీవ్ర కలకలం రేపుతోంది.. గత మే నెల 12వ తేదీన ప్రియుడు మోహన్ పై ప్రేయసి పార్వతి పెట్రోల్ పోసి నిప్పట్టించిన ఘటన మనసులో పెట్టుకొని.. మంగళవారం సాయంత్రం ప్రియురాలు పార్వతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు పార్వతి.. ఇక, ఈ ఘటనపై రాయదుర్గం సివిల్ కోర్టు జడ్జి రమ్య ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధితురాలతో వాంగ్మూలాన్ని తీసుకున్నారు. సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పార్వతి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా చెబుతున్నారు..

Read Also: Off The Record: మూడో విడత రుణమాఫీపై విస్తృత చర్చ.. రేవంత్ సర్కార్ మాట నిలబెట్టుకుంటుందా..?

Show comments