Site icon NTV Telugu

Teacher and Students: మరో స్కూల్‌కి ఉపాధ్యాయుడి బదిలీ.. మమ్మల్ని వదిలి వెళ్లకండి సార్ అంటూ విద్యార్థుల కన్నీరు..

Teacher

Teacher

Teacher and Students: కొందురు ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఎంతో అనుబంధం ఉంటుంది.. పిల్లల ఆలోచనలు, వారి మనస్తత్వానికి అనుగుణంగా పాఠాలు చెబుతూ.. తమతో కలిసి పోయే టీచర్లు అంటే విద్యార్థులకు ఎంతో మక్కువ.. అయితే, తాము అభిమానించే మాస్టారు మరో స్కూల్‌కు బదిలీ అవుతున్నారంటే జీర్ణించుకోలేరు.. అలాంటి ఘటనే ఇప్పుడు అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది..

Read Also: Warangal: ఇన్స్టాలో మైనర్ బాలిక, బాలుడు రీల్.. ఘర్షణలో రెచ్చిపోయిన 50 మంది

కంబదూరు మండల కేంద్రం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు హనుమంతురాయుడు మరొక పాఠశాలకు బదిలీ అయ్యారు.. దీంతో, పాఠశాలలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ‘మమ్మల్ని వదిలి వెళ్లకండి సార్’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హనుమంతురాయుడు విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని.. వారికి అనుగుణంగా బోధన చేసే వారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.. పేద విద్యార్థులకు గురుకులం, ఏపీఆర్ఎస్ వంటి వాటికి శిక్షణ ఇచ్చి.. ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకుంటున్నారు..

Exit mobile version