JC Prabhakar Reddy: తాడిపత్రి అభివృద్ధి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం.. ప్రజలు తమ బంధువులు.. స్నేహితులు సహకరించాలని చేతులు జోడించి విన్నవించారు. ఇక, తాడిపత్రి చుట్టుపక్కల ఉన్న బైపాస్ రోడ్లలో చెత్తవేస్తే కేసులు నమోదు చేస్తామంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. నందలపాడు, సజ్జలదిన్నె పారిశ్రామిక వాడల్లో ఉన్న నల్ల బండలలో పాలిష్ వృథా రాళ్లు రోడ్ల పక్కన వేస్తే ట్రాక్టర్లు సీజ్ చేస్తామన్నారు.
Read Also: ICMR Report: సమోసా, చిప్స్, కేక్స్ వల్లే దేశంలో షుగర్ వ్యాధి విస్తరిస్తోంది.. షాకింగ్ రిపోర్ట్
ఇక, తాడిపత్రి అభివృద్ధి చెందిందంటే పరిశ్రమల వల్లే సాధ్యమైందన్నారు జేసీ… పరిశ్రమలు స్థాపించిన యజమానులు అందరూ బాగా చదువుకున్న వారేనని.. పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలు వేస్ట్ రాళ్లు రోడ్డు పక్కన వేస్తే పరిశ్రమలకు కరెంటు బంద్ చేయిస్తామని స్పష్టం చేశారు.. తాడిపత్రి అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితులలో ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు. పారిశ్రామిక వాడల చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గ్రానైట్ నల్లబండల వృథా రాళ్లు ఎక్కడపడితే అక్కడ వదిలేసేవాళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ లోపు తాడిపత్రి పట్టణమంతా శుభ్రంగా ఉంచాలన్నారు.. ఆయా ప్లాట్ల మధ్యలో రోడ్లు వేస్తానని.. నష్టపోకుండా ఫ్లాట్ల యజమానులు చూసుకోవాలన్నారు. మరోవైపు.. ట్రాక్టర్లు విడిపించుకోవడానికి తన బంధువులు.. స్నేహితులు.. పార్టీ నాయకుడు ఎవరు తన వద్దకు రావద్దని చేతులు జోడించి విన్నవించారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.