Super Six – Super Hit Meeting: ఈ నెల (సెప్టెంబర్) 10వ తేదీన అనంతపురంలో నిర్వహించే సూపర్ సిక్స్- సూపర్ హిట్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నారాయణ, సవిత, పయ్యావుల కేశవ్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలతో కలిసి మంత్రి అనగాని సత్య ప్రసాద్ సమీక్షించారు. సభా వేదిక, హెలిపాడ్ ఏర్పాటు చేసే స్థలాలను మంత్రుల బృందం పరిశీలించింది. సూపర్ సిక్స్- సూపర్ హిట్ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా వస్తున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. సభకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు వాహనాల పార్కింగ్, మంచినీటి సౌకర్యంతో పాటు ఇతర అవసరాలపై మంత్రుల బృందం చర్చించింది.
Read Also: Alcohol Effects on Sleep: షాకింగ్ నిజాలు.. మద్యం తాగి నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా?
ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాలు అనతికాలంలోనే అమలు చేశాం.. భవిష్యత్తులో ఏం చేయాలని యోచిస్తున్నాం.. అనంతపురాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం.. సభకు 3.5 లక్షల మంది హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాం.. సభకు వచ్చే వారికి ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తాం.. ఇక, ప్రతిపక్ష హోదా లేని నాయకుడు అనవసర ఆరోపణలు చేస్తున్నారు.. అందరికీ యూనివర్షల్ బీమా పాలసీ తీసుకొస్తే విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. 6 గంటల్లో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.. మెడికల్ కళాశాలలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. విశాఖలో ప్యాలెస్ కట్టే బదులు మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా అన్నారు. మా నాయకులపై కేసులు ప్రజా హితం కోసం పెట్టినవి.. వాళ్ళ మాదిరి దోచుకొని దాచుకోలేదని మంత్రి అనగాని పేర్కొన్నారు.
Read Also: Viral Video: టవర్ ఎక్కి టీచర్ హల్‌చల్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇక, ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో గాడిలో పెడుతున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని డబుల్ చేశాం.. గతంలో 42 లక్షల మందికి అమ్మ ఒడిస్తుంటే 60 లక్షల మందికి పైగా ఇస్తున్నాం.. పింఛన్ రూ. 3000 నుంచి రూ. 4000కి పెంచాం.. పీఎం నరేంద్ర మోడీ దీపావళికి ముందే చెప్పినట్లుగానే డబుల్ ధమాకా ఇచ్చారు.. జీఎస్టీని రెండు స్లాబ్ లకు తెచ్చారు.. పేదలకు అవసరమైన వాటిపై ట్యాక్స్ ను పూర్తిగా తొలగించారు.. జీఎస్టీలో మార్పుల ప్రతిపాదనపై మొదటిసారి మద్దతు తెలిపింది చంద్రబాబే అని మంత్రి పయ్యావుల చెప్పుకొచ్చారు.
