Site icon NTV Telugu

Anantapur Crime: కొత్తరకం మోసం.. కారులో సీఐ సార్‌ ఉన్నారంటూ..!

Anantapur Crime

Anantapur Crime

Anantapur Crime: అనంతపురంలో కొత్తరకం మోసం వెలుగు చూసింది.. కారులో సీఐ సార్‌ ఉన్నారంటూ చెప్పి కిరాణా షాపులో సరుకులు ఎత్తుకెళ్లారు దుండగులు.. పోలీసునంటూ ఏకంగా కిరాణా దుకాణం యజమానిని బెదిరించాడు ఓ దొంగ. తాను టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐనంటూ.. తనకు సరుకులు ఇవ్వాలని కిరాణా దుకాణం యజమానిపై రెచ్చిపోయాడు. సుమారు రూ. 3 వేలు విలువ చేసే సరుకులను తీసుకొని డబ్బులు చెల్లించకుండా అక్కడ నుంచి ఊడయించాడు. ఈ సంఘటన అనంతపురం నగరంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలలో నమోదు అయ్యాయి.

Read Also: Chinmoy Krishna Das: హిందూ నేత చిన్మోయ్ కృష్ణ దాస్‌కి బంగ్లాదేశ్ కోర్ట్ బెయిల్..

అనంతపురం నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాతూరులో రాత్రి 9 గంటల సమయంలో కిరాణా దుకాణానికి వచ్చిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తాను టూటౌన్ సీఐని అంటూ సరుకులు ఇవ్వాలని కిరాణా దుకాణం దారుడిని బెదిరించాడు. దుకాణదారుడు కళ్యాణ్ చేసేదేమీ లేక… ఏమి కావాలి సార్ అంటూ తాను అడిగిన సరుకులు అన్ని ఇచ్చేశాడు. సరుకులకు డబ్బులు ఇవ్వాలని కోరగా పోలీసులనే డబ్బులు అడుగుతావా ఇచ్చేది లేదు ఏమి చేసుకుంటావో చేసుకోపో… అంటూ సరుకులను మొత్తం కారులో తీసుకొని వెళ్ళిపోయాడు. దీనిని గమనించిన దుకాణదారుడు కారు నెంబరు తెలుసుకొని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారించిన పోలీసులు కనగానపల్లి మండలానికి చెందిన లక్ష్మీనారాయణగా గుర్తించి పట్టుకొచ్చారు. ఇతనిపై కర్ణాటక ఇతర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయినట్లు విచారణలో తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ రాజేంద్రనాథ్ తెలిపారు.

Exit mobile version